శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 5 ఆగస్టు 2017 (21:21 IST)

ఇంట్లో చీమలు, బొద్దింకలు వేధిస్తున్నాయా..? ఇవి పెట్టండి... పారిపోతాయ్....

చాలామంది ఇళ్లలో చీమలు, బొద్దింకల బెడద ఎక్కువగా వుంటుంది. వాటిని ఎలా వదిలించుకోవాల్రా దేవుడా అని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చీమలు దోమలను పారదోలవచ్చు. చీమలకు.... చీమలు ఘాటు వాసన తట్టుకోలేవు. కాబట్టి దాల్చిన చెక్క, వె

చాలామంది ఇళ్లలో చీమలు, బొద్దింకల బెడద ఎక్కువగా వుంటుంది. వాటిని ఎలా వదిలించుకోవాల్రా దేవుడా అని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చీమలు దోమలను పారదోలవచ్చు.
 
చీమలకు....
చీమలు ఘాటు వాసన తట్టుకోలేవు. కాబట్టి దాల్చిన చెక్క, వెల్లుల్లి ముక్కలను చీమలు తిరిగే చోట, కిటికీ పగుళ్ల వద్ద వుంచాలి. అలా వుంచితే చీమలు అటువైపు రావు. చీమలు పూర్తిగా ఇంట్లో నుంచి పారిపోయే వరకూ వీటిని 3 రోజులకోసారి మారుస్తూ వుండాలి.
 
ఇంకా చీమలు తాము నడిచే దారి వెంట వాసన వదిలి వెళ్తుంటాయి. కాబట్టి అవి తిరిగి అదే దారిన రాకుండా అక్కడ నీళ్లు, వైట్ డిస్టిల్డ్ వెనిగర్ సమపాళ్లలో కలిపి కడగాలి.
 
బొద్దింకలను పారదోలేందుకు....
రెండు కప్పుల నీళ్లలో కప్పు తులసి ఆకులు మరగబెట్టి, ఆ నీళ్లను కిటికీ అంచులు, సింక్ పైపులు, మూలల్లో స్ప్రే చేయండి. అంతే.