సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (10:33 IST)

జూమ్ లైవ్‌లో తండ్రి.. ఒకరు నగ్నంగా కనిపించడంతో కుమారుడు ఏం చేశాడంటే?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జూమ్ లైవ్ కాల్‌లో వుండగా తండ్రిని కుమారుడు హతమార్చిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ సఫోల్క్ కౌంటీ పరిధికి చెందిన డ్వైట్ పవర్స్ (72) తన కుమారుడు థామస్ స్కల్లీ పవర్స్‌తో కలిసి నివసిస్తున్నాడు. వీరి మధ్య మనస్పర్థలు వున్నాయా లేదా అనే అంశం ఇంకా తేలలేదు. 
 
కానీ గురువారం మధ్యాహ్నాం థామస్ ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో డ్వైట్.. జూమ్ వీడియా కాల్ మాట్లాడుతున్నారు. లైవ్‌లో 20 మంది ఉన్నారు. అందులో ఒకరు నగ్నంగా ఉన్నారు. వీడియో కాల్ మాట్లాడుతున్న తండ్రిని చూసి కుమారుడు కోపంతో ఊగిపోయాడు. కత్తితో దాడి చేశాడు. ఇదంతా వీడియో కాల్‌లో కనిపించడంతో కాల్‌లో వున్నవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు థామస్‌ని అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో థామస్‌కు గాయాలైనాయి. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. థామస్‌పై సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగం మోపి.. అరెస్ట్ చేశారు. అయితే వీడియోలో నగ్నంగా ఉన్నారో తెలియలేదు.