కుమారుడు కరోనా అంటించాడు, తండ్రి మరణించాడు

corona virus
జె| Last Modified బుధవారం, 20 మే 2020 (21:36 IST)
కరోనా సోకిన వ్యక్తుల కన్నా కాంటాక్ట్ పద్థతిన సోకే వారికే
ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. పది సంవత్సరాలలోపు వారు 60 సంవత్సరాలకు పైబడిన వారు బయట తిరగవద్దని.. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే వారు జాగ్రత్తగా ఉన్నా వారి కుటుంబ సభ్యుల ద్వారా కరోనా సోకడంతో ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన 60 యేళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ నెల 13వ తేదీన స్విమ్స్ ఆసుపత్రిలో కరోనాతో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి కుమారుడి ద్వారా వైరస్ వ్యాపించినట్లు వైద్యులు నిర్థారించారు.

గత రెండు నెలల క్రితం మృతి చెందిన వ్యక్తి కుమారుడు విదేశాల నుంచి వచ్చాడు. కరోనాతో వచ్చిన కుమారుడి ద్వారా ఆ వైరస్ సోకింది. అంతకు ముందే షుగర్, బిపితో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న 60 యేళ్ల వ్యక్తిని
బతికించేందుకు శాయశక్తులా వైద్యులు ప్రయత్నించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని తిరుపతి కరంకంబాడి రోడ్డులోని గోవిందధామం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.దీనిపై మరింత చదవండి :