శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 19 మే 2020 (20:09 IST)

89 మంది సినిమా జ‌ర్న‌లిస్టులకు రూ. 2,67,000 సాయం

కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌లేదు. ప్ర‌తీరోజు ప్రెస్ మీట్స్‌తో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వారికి ఆస‌రాగా నిల‌వాల‌న్న‌ ఉద్దేశ్యంతో స‌భ్యులంద‌రికీ అసోసియేష‌న్ ద్వారా దాదాపు మెంబ‌ర్లు అంద‌రికీ ఫోన్లు చేసి ఎలాంటి తార‌త‌మ్యం లేకుండా, వ‌ద్దన్న వారిని వ‌దిలేసి కమిటీ సభ్యుల సహకారంతో గత నెల ఏప్రిల్ 13వ తేదీన 87 మంది మెంబర్స్‌కి ఐదువేల రూపాయ‌లు చొప్పున వారి అకౌంట్‌లోకి నెఫ్ట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. 
 
అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన సిసిసి ద్వారా నిత్యావసర సరుకులు కూడా సినిమా జర్నలిస్టులకు  అందించ‌డం జ‌రిగింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ మే నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు మళ్లీ ఈసారి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని కమిటీ సభ్యులు తీర్మానించుకుని వద్దన్న వారిని వదిలేసి 89 మంది సభ్యులకు మంగళవారం రోజు వారి అకౌంట్‌కు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
 
ఈసంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ, `క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హాయ స‌హకారాల‌తో రెండో విడతగా ఈరోజు అనగా మంగళవారం నాడు వద్దన్న వారికి వదిలేసి 89 మంది మెంబ‌ర్స్‌కి  ఒక్కొక్క‌రికి మూడు వేల రూపాయ‌లు చొప్పున పంపించాం. సినిమా ఇండ‌స్ట్రీలోని 24 క్రాప్ట్స్‌ని ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మేన‌ని చెబుతూ మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి ప‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను` అని అన్నారు.
 
జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జ‌నార్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ, `స‌మిష్టిగా అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నాం. క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విప‌త్తు ఎప్పుడూ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నాను` అని అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులైన 89 మందికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు చెక్కుల రూపంలో 2,67,000 రూపాయలు చెక్కులను ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ టి సీతారాములు గారికి ప్రెసిడెంట్ సురేష్ కొండేటి జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ట్రెజరర్ భూషణ్ కమిటీ సభ్యులు సాయి రమేష్ గౌరవ సలహాదారు లక్ష్మణరావు అందించారు.