శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: గురువారం, 14 మే 2020 (17:18 IST)

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు దగ్గు మాత్రలు

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు గాలిలో వేగంగా ప్రయాణించడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోంది. దీనిని అరికట్టడం కోసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం మరియు మాస్క్‌లు ధరించడం వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఇది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు, మార్కెట్‌లు, పరిశ్రమలు వంటి పలుచోట్ల ఇది అస్సలు సాధ్యం కాదు. 
 
అమెరికా పరిశోధకులు దీనికి పరిష్కారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. కొత్త రకం దగ్గుబిళ్లను తయారు చేస్తున్నారు. ఇది నోట్లో వేసుకుంటే లాలాజలం బరువు పెరుగుతుందట, మరియు సులభంగా అతుక్కునే గుణం దీనికి ఉంటుంది. అప్పుడు తుమ్మినా, దగ్గినా, లాలాజలం తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణించకుండా బరువుకి పడిపోతాయి. 
 
దీంతో ఈ బిళ్ల వేసుకుని మాస్క్ పెట్టుకుంటే 2 అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. హైస్పీడ్ కెమెరాల ద్వారా తుంపర్లు ప్రయాణించే తీరును పరిశీలించి అవి ఎక్కువ దూరం వెళ్లడం లేదని గుర్తించారు.