శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 11 మే 2020 (23:10 IST)

విటమిన్ డి లోపంతో వున్నవారికి కోవిడ్ 19 వస్తే అంతేసంగతులు...

విటమిన్ డి లోపంతో వున్నవారు అధిక సంఖ్యలో కోవిడ్ -19 బారిన పడినట్లు అధ్యయనంలో తేలింది. అంతేకాదు ఈ విటమిన్ లోపంతో వున్నవారు అధిక సంఖ్యలో మరణించినట్లు ఆ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా 20 యూరోపియన్ దేశాలలో ఇది వెలుగుచూసినట్లు పేర్కొంది.
 
ఇంగ్లాండు లోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం, క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ కింగ్స్ లిన్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని ఈ పరిశోధన ఏజింగ్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ రీసెర్చ్ పత్రికలో ప్రచురించబడింది. విటమిన్ డి తెల్ల రక్త కణాల ప్రతిస్పందనను మాడ్యులేట్ చేస్తుందనీ, ఎక్కువ శోథ సైటోకిన్‌లను విడుదల చేయకుండా నిరోధిస్తుందని తేలింది.
 
కోవిడ్ వ్యాప్తి పైన జరిగిన కొత్త అధ్యయనం ప్రకారం ఇటలీ, స్పెయిన్ రెండూ అధిక కోవిడ్ -19 మరణాల రేటును కలిగి వున్నాయి. ఇక్కడ చనిపోయినవారంతా ఉత్తర యూరోపియన్ దేశాల కంటే తక్కువ సగటు విటమిన్ డి స్థాయిలను కలిగి ఉన్నట్లు తేలింది.
 
విటమిన్ డి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుందని తేలింది. విటమిన్ డి ఎక్కడ అధికంగా లభ్యమవుతుందో తెలిసిందే. ఎండ ద్వారా ఈ విటిమిన్ పొందవచ్చు.