థియేటర్స్‌కి కొత్త రూల్స్, ఇదే జరిగితే.. సినీ ప్రియులకు పండగే..!
కరోనా కారణంగా సినిమా హాల్స్ మూసివేసిన విషయం తెలిసిందే. థియేటర్స్ మూసేయడంతో సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారా..? అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొంతమంది జూన్, జులై వరకు థియేటర్స్ ఓపెన్ చేయరు అని చెబితే.. కొంతమంది అయితే... నవంబర్, డిసెంబర్ వరకు ఓపెన్ చేయరు అని చెప్పారు.
దీంతో అప్పటివరకు థియేటర్స్ ఓపెన్ చేయరా..? అని ఫీలయ్యారు సినీ ప్రియులు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.... త్వరలోనే థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే విషయమై ఆలోచిస్తుందని వార్తలు వస్తున్నాయి.
అయితే.. కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుందని తెలిసింది. ఇంతకీ కొత్త రూల్స్ ఏంటంటే... థియేటర్లో సీటుకు సీటు మధ్య ఒక సీటు గ్యాప్ ఇచ్చేలా.. ఏర్పాట్లు చేస్తున్నారట.
అంతేకాకుండా.. ఒక షోకు మరో షోకు మధ్య 45 నిమిషాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకిలా చేస్తున్నారంటే... షో కంప్లీట్ అయిన తర్వాత థియేటర్లోని అన్ని సీట్లను శానిటైజ్ చేసి ఎర్ర రిబ్బన్ పెట్టాలని.. దీనికి ఎక్కువ టైమ్ అయితే రోజుకు నాలుగు షోలకు బదులు మూడు షోలనే ప్రదర్శించాలని అనుకుంటున్నారట. త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం. మరి... థియేటర్ ఓపెన్ చేస్తే... ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.