శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: శనివారం, 9 మే 2020 (18:32 IST)

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, బాబు ఎలా ఉన్నాడు?

ప్రస్తుతం కరోనా అంటేనే భయపడిపోతున్న పరిస్థితి. ఇక ఆ వైరస్ సోకిందంటే చెప్పాలా.. ఎంతో టెన్షన్. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో బతుకుతామా లేదా అన్నది అందరిలో ఉన్న భావన. అలాంటిది ఒక నిండుగర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బాబు ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు.
 
తెలంగాణారాష్ట్రంలోని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏడుగురు గర్భిణిలు కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. అయితే అందులో ఒక మహిళకు నిన్న రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెకు సర్జరీ చేశారు. అయితే మూడుకిలోల బరువున్న బాబు పుట్టాడు. అతను ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు.
 
పాజిటివ్ మహిళకు సర్జరీ చేయడమంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటిది వైద్యులు సైనికుల్లా మారి ఎంతో కష్టపడి సర్జరీ చేశారు. దీంతో వైద్యులను ప్రసంసించారు ముఖ్యమంత్రి కెసిఆర్. తమ విధులను తాము నిర్వర్తించామని వైద్యులు చెబుతున్నారు.
 
అయితే నిండుగర్భిణికి పాజిటివ్ రావడానికి ఆమె అత్త కారణం. అయితే ఆమె మాత్రం చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలోనే కన్ను మూసింది. కానీ గర్భిణులను మాత్రం ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు వైద్యులు. మిగిలిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్జరీ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులు.