శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (18:34 IST)

భార్య తనను కలిసేందుకు రాలేదని మర్మాంగాన్ని కోసుకున్న ఖైదీ

అతనో ఖైదీ.. జీవిత శిక్షను అనుభవిస్తున్నాడు. క్రిస్మస్ పండుగ వచ్చింది. అందరి కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ తన భార్య రాలేదు. చాలాసేపు వేచి చూశాడు. ఆమె రాకపోవడంతో కోపం ఆపుకోలేకపోయాడు. దారుణంగా తన మర్మాంగాన్ని తానే కోసేసుకున్నాడు.
 
నైరుతి స్పెయిన్‌లో ప్యూర్టో డీశాంటా మారియాలోని పూర్టో మూడు నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతనికి జీవిత ఖైదు పడింది. ప్రతి వారం భార్య జైలుకు వచ్చి పలుకరించి వెళ్ళేది. అయితే క్రిస్మస్ పండుగ రోజు కూడా వస్తానని గత వారం కలిసినప్పుడు చెప్పింది.
 
పండుగరోజు తినేందుకు ఏదో ఒకటి తెస్తుంది. ఆప్యాయంగా పలుకరిస్తుందని భర్త ఎన్నో ఆశలతో ఉన్నాడు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలుగా మారిపోయాయి. క్రిస్మస్ ముగిసింది కానీ భార్య రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన భర్త చివరకు తాను ఉన్న గదిలో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది.
 
పక్కనే నిద్రిస్తున్న ఖైదీ చూసి వెంటనే జైలు సిబ్బందికి సమాచారమిచ్చారు. అతన్ని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.