హిల్లరీ క్లింటన్ ఓ క్రిమినల్... ఆమెకు నేనెందుకు ఓటు వేస్తా : డెమొక్రాటిక్ ఎలక్టర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ ఎన్నికల గళం రణరంగంలా మారింది. పుయలుప్ తెగకు చెందిన నేత రాబర్ట్ సాషియాకమ్ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన డెమొక్రాటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ మద్దతుదారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ ఎన్నికల గళం రణరంగంలా మారింది. పుయలుప్ తెగకు చెందిన నేత రాబర్ట్ సాషియాకమ్ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన డెమొక్రాటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ మద్దతుదారు. వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన రాబర్ట్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌కు ఓటు వేసేది లేదని తెగేసి చెప్పారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచినప్పటికీ ఎలక్టొరల్ కాలేజీ ఓటును తాను ఆమెకు మద్దతుగా వేసేది లేదని తేల్చి చెప్పాడు. క్లింటన్ ఓ క్రిమినల్ అని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. అమెరికన్ ఇండియన్ల గురించి ఆమె సరిగ్గా పట్టించుకోరని ఆరోపించారు.
ఆమె చేసిందేమీ లేదని, తిమ్మిని, బమ్మి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తాను ఏం చేయాలనే విషయంపై చాలా తర్జనభర్జన పడుతున్నట్టు చెప్పారు. క్లింటన్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికాకు నాయకత్వం వహించలేరన్నారు. ‘‘నా భూమి గురించి కానీ, నా గాలి గురించి కానీ, నా నిప్పు గురించి కానీ, నా నీరు గురించి కానీ ఆమె పట్టించుకోరు’’ ఆయన వ్యాఖ్యానించారు.