బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (17:10 IST)

ఒత్తిడితో శునకపు జుట్టు కూడా తెల్లబడిపోతుందట.. ఆడ శునకాలకే ఆ బాధ ఎక్కువట..

ఒత్తిడి కారణంగా.. చిన్న వయస్సులోనే అనేకమందికి జుట్టు తెల్లగా మారిపోతుండటం గమనించే వుంటాం. అయితే మానవులేంటి పెంపుడు జంతువు అయిన శునకంలోనూ అధిక ఒత్తిడి కారణంగా పిన్న వయస్సులో జుట్టు తెల్లబడే ఛాన్సులున్న

ఒత్తిడి కారణంగా.. చిన్న వయస్సులోనే అనేకమందికి జుట్టు తెల్లగా మారిపోతుండటం గమనించే వుంటాం. అయితే మానవులేంటి పెంపుడు జంతువు అయిన శునకంలోనూ అధిక ఒత్తిడి కారణంగా పిన్న వయస్సులో జుట్టు తెల్లబడే ఛాన్సులున్నట్లు కొలరాడో పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా శునకపు జుట్టు కూడా తెల్లబడిపోతుందట. ఈ పరిశోధనా పత్రాన్ని అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌‌లో ప్రచురించారు. ''క్వైట్ స్ట్రైకింగ్" గా ఈ రిపోర్టును అభివవర్ణించబడింది. 
 
కొలరాడోలో 1-4 వయస్సున్న 400 ముదురు రంగు శునకాలపై జరిపిన ఈ పరిశోధనలో నలుపు రంగు జుట్టున్న శునకాల రంగు ఒత్తిడి కారణంగా తెల్లబడటం గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కుక్కల ఆరోగ్యం కూడా తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ప్రభావం చూపే అవకాశాలున్నట్టు తేల్చారు. 
 
వ్యాకులత, మానసిక ఆందోళన అధిక స్థాయిలో ఉన్న కుక్కల్లో బూడిద జుట్టును ఉంటుందని తెలివపారు. పెద్ద పెద్ద శబ్ధాలకు శునకాలు భయపడతాయని, ఏదో తెలియని భయంతో ఒత్తిడికి గురవుతాయని.. ఇలా ప్రవర్తించడం ద్వారా కుక్కల్లోనూ జుట్టు నెరసి పోవడాన్ని గుర్తించినట్లు పరిశోధకులు అంటున్నారు. 
 
అంతేగాకుండా మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల్లోనే ఒత్తిడి ఎక్కువ అని కూడా తేల్చారు. మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల బొచ్చు చాలా తొందరగా తెల్లబడుతునట్టు కూడా అధ్యయనం తేల్చింది.