అధికంగా టీ తాగుతున్నారా..? యువతికి శస్త్రచికిత్స 300 రాళ్ల తొలగింపు!
అధికంగా టీ తాగుతున్నారా.. టీ తాగే అలవాటు మీకుందా.. అయితే జాగ్రత్త పడండి. ఓ యువతి కడుపులో 300 రాళ్లను వైద్యులు వెలికితీశారు. సాధారణంగా మనం నీటిని ఎక్కువగా తీసుకోకపోతే.. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోవు. ఆ వ్యర్థాలు మూత్రపిండాల్లో అలాగే రాళ్లుగా మారిపోతాయి. ఈ రాళ్లను తొలగించడం కోసం శస్త్రచికిత్స తప్పనిసరి.
ఇటీవల తైవాన్‌లో సియోబు అనే 20 ఏళ్ల యువతికి కిడ్నీలో ఆపరేషన్ చేశారు. ఈ శస్త్రచికిత్స ద్వారా ఆమె మూత్రపిండం నుంచి 300 రాళ్లను వెలికి తీశారు. ఈమెకు నీటిని ఎక్కువగా సేవించే అలవాటు లేకపోవడమే ఈ శస్త్రచికిత్సకు కారణమని వైద్యులు తెలిపారు.
దాహం ఎత్తినా సదరు యువతి బబుల్ టీ తాగడం అలవాటు చేసుకుంది. నీటిని తాగడం తగ్గించేసింది. దీంతో శరీరంలో వ్యర్థాలు కిడ్నీలో రాళ్లుగా మారాయి. ఫలితం ఆపరేషన్ ద్వారా 300 రాళ్లను వెలికితీశారు వైద్యులు. అందుచేత దాహం లేకపోయినా.. నీటిని సేవించడం అలవాటు చేసుకోవాలి.