యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సమస్య ఏంటి?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఐతే ఇదే ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో జాయిన్ అయ్యారు.
గత నెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గొంతు సమస్యతో బాధపడినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో యశోద ఆసుపత్రిలో చేరినట్లు చెపుతున్నారు. ఐతే అసలు కారణం ఏంటన్నది ఆసుపత్రి వర్గాలు తెలియజేయాల్సి వుంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డిని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పరామర్శించారు. తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కోమటిరెడ్డి ఆరోగ్యంపై వాకబు చేసారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.