శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2023 (16:46 IST)

దిల్ రాజు ఒక్కరే ఫోన్ చేసి అభినందించారు : సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి

komatireddy
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం తన ఛాంబరులోకి అడుగుపెట్టి, బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన మంతర్ిగా తన కార్యకలాపాలను ప్రారంభించారు. నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. దీంతో ఆయన ఆదివారం మంత్రిగా తన చాంబరులోకి ప్రవేశించారు.
komatireddy
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యలు చేపట్టాక సినీ రంగం నుంచి నిర్మాత దిల్ రాజు మినహా మరెవ్వరూ తనకు ఫోన్ చేయలేదని వెంకట్ రెడ్డి తెలిపారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారమైనప్పటికీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పలు కీలమైన ఫైళ్లపై సంతకాలు చేసినట్టు చెప్పారు. మరోవైపు, తన అన్న వెంకట్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.