బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (10:29 IST)

ఏజెంట్‌ తో మానసికగంగా మారడం అంటే ఇదే అన్న అఖిల్ అక్కినేని

Akhil at kakinada
Akhil at kakinada
అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్‌’ తో మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి ఈనెల 28న వస్తున్నారు. నిన్న కాకినాడలో ఏజెంట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ ట్రైలర్ ని లాంచ్ చేశారు. 
 
అనంతరం అఖిల్ మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, ఎనర్జీ,  వచ్చే పదిరోజులు రిలీజ్ వరకూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ అందరికీ కృతజ్ఞతలు. ఏజెంట్ రెండేళ్ళ జర్నీ. ఈ జర్నీని మాటల్లో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. ఈ జర్నీలో మానసికంగా చాలా మారాను. నాకు సినిమా, అభిమానులు అంటే ఎంత పిచ్చో  అర్ధమైయింది. నేను ఇక్కడే వుంటాను మీ కోసం పని చేస్తూనే వుంటాను. మీ అభిమానం గుండెల్లో దాచిపెట్టుకుంటాను. సాక్షి వైద్య ఏజెంట్ లో సర్ ప్రైజ్ ప్యాకేజ్. సినిమా అంటే తనకి ప్రాణం. హిపాప్ తమిళా ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశారు. బీజీఏం చాలా వైల్డ్ గా వుంటుంది. అనిల్ సుంకర గారు నా బ్యాక్ బోన్. అభిమానుల కోసం ఇంత పెద్ద సినిమా చెద్దాం అందరికీ పిచ్చెక్కిపోవాలని అన్నారు. అదే మాట మీద నిలబడ్డారు. ఆయన నా సపోర్ట్ సిస్టం. ఏజెంట్ క్రెడిట్ అంతా దర్శకుడు సురేందర్ రెడ్డి గారికే ఇస్తాను. నన్ను ఇలా చూపించాలని ఇమాజిన్ చేసింది ఆయనే. నన్ను ఎప్పుడూ ఇలా ఊహించుకోలేదు. ఈ రోజు ఇంత నమ్మకంగా మాట్లడుతున్నానంటే ఏజెంట్ ఇచ్చిన ధైర్యం. ఏజెంట్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. సురేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అభిమానులు నాపై ఎంత బరువు పెట్టినా దాన్ని మోస్తాను, మీ కోసం వైల్డ్ గా వస్తూనే వుంటాను. మమ్మల్ని బ్లెస్ చేయడానికి విచ్చేసిన గౌరవ మంత్రిగా గారికి కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞతలు అన్నారు