శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (14:34 IST)

అఖిల్ అక్కినేని ఏజెంట్‌.. ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్ హిట్ ఇస్తుందా?

Urvashi Rautela
ఊర్వశి రౌతేలా తన హాట్ ఐటెం సాంగ్ పెర్ఫార్మెన్స్‌ల కోసం బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ‘వాల్తేర్ వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన "బాస్ పార్టీ" పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ద్వారా ఆమె తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం మరో తెలుగు పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. 
 
అఖిల్ అక్కినేని రాబోయే చిత్రం "ఏజెంట్"లో ఆమె ఒక ప్రత్యేక పాటకు చిందులేసింది. హిప్‌హాప్ తమిళా స్వరపరిచిన ఒక అద్భుతమైన పాటకు అఖిల్ అక్కినేనితో స్టెప్పులు ఇరగదీసింది.
 
'ఈ పాట ఓ రేంజ్‌లో ఉండబోతోంది. డ్యాన్స్ ఔత్సాహికులు దక్షిణ భారత బీట్‌లను ఆస్వాదిస్తారు. సినిమాలో నాకు చాలా ఇష్టమైనది" అని అఖిల్ అక్కినేని కామెంట్స్ చేశారు. 
 
ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న రామ్ పోతినేని, బోయపాటి చిత్రంలో ఊర్వశి రౌతేల కూడా ఒక ప్రత్యేక పాటలో కనిపించింది. ఇలా టాలీవుడ్‌లో మూడు ఐటెం సాంగ్స్ చేసింది ఊర్వశి.