దక్షిణాది పాటలకంటే బాలీవుడ్ సాంగ్స్ బాగుంటాయి.. రష్మికకు ఏమైంది..?
కన్నడ భామ రష్మిక దక్షిణాది సినీ ఇండస్ట్రీ పాటలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ గురైంది. ఇటీవల రష్మీక కాంతార చిత్రం, ఆ మూవీ డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టిపై చేసిన కామెంంట్స్ కన్నడీగులకు కోపం తెప్పించింది. తాజాగా బాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించింది. దీంతో సౌత్ ఇండస్ట్రీ ఆమెపై గుర్రుగా వుంది.
సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో దక్షిణాది ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా వున్నారు. ఇంకా రష్మిక మాట్లాడుతూ.. బాలీవుడ్ సాంగ్స్ వింటూ, చూస్తూ పెరిగాను. దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయి.
సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ.. అదే నార్త్ ఇండియా సాంగ్స్ బాగుంటాయి... అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రోలింగ్ కు దారితీశాయి. రష్మికపై దక్షిణాది సినీ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్లు ఇచ్చిన దక్షిణాది సినీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.