ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (17:16 IST)

నయన శరీరాకృతిపై ట్రోలింగ్.. సీన్‌లోకి వచ్చిన చిన్మయి..

chinmayi sripada
లేడీ సూపర్ స్టార్ నయనతారపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నయన-విక్కీ తల్లిదండ్రులు అయ్యారు. కవలలకు వీరు పారెంట్స్ అయ్యారు. ప్రస్తుతం సంతానం ఆలనాపాలనా చూస్తూ గడుపుతున్నారు. 
 
అయితే నయన శరీరాకృతి గురించి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నయన-విఘ్నేశ్ దంపతులు తాజాగా ఓ కార్యక్రమంలో హాజరైయ్యారు. 
 
ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు నయనతార శరీరాకృతిపై అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్నారు. 
 
ఈ వ్యవహారంపై మీ టూపై గొంతెత్తిన సింగర్ చిన్మయి ఫైర్ అయ్యింది. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లను దూరం పెట్టాలని మండిపడింది. ఇలాంటి వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శలు గుప్పించింది.