ప్రభాస్ చేతుల మీదుగా కనెక్ట్ ట్రైలర్.. వెన్నులో వణుకు!
కనెక్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ హారర్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోంది.
టాలీవుడ్ హీరో ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేసిన ఈ ట్రైలర్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, వినయ్, సత్యరాజ్, నసిఫా హనియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్, రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2022 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.