గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (22:52 IST)

నయన్-విక్కీ దంపతులకు కవలపిల్లలు చట్టబద్ధంగానే జన్మించారు

Nayan_Vicky
Nayan_Vicky
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులకు కవలపిల్లలపై ఊరట లభించింది. కవలపిల్లలు చట్టబద్ధంగానే జన్మించారని తమిళనాడు విచారణ కమిటీ తేల్చి చెప్పింది. చట్టబద్ధంగానే సరోగసీ ద్వారా నయన్ దంపతులు పిల్లలను కన్నారని కూడా ఆ కమిటీ తెలిపింది. 
 
ఈ మేరకు తమిళనాడు సర్కారుకు కమిటీ తన నివేదికను బుధవారం సమర్పించింది. ఈ నివేదికలో నయన్ పెళ్లి, సరోగసీ కోసం ఆ దంపతులు చేపట్టిన చర్యలను కమిటీ కూలంకషంగా ప్రస్తావించింది.
 
2016 మార్చి 11న విఘ్నేశ్ శివన్‌ను నయనతార పెళ్లి చేసుకున్నట్లు ఆ దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా కమిటీ తెలిపింది. ఈ క్రమంలో సరోగసీ కోసం నయన్ దంపతులు 2021 ఆగస్టులో ప్రక్రియను మొదలుపెట్టారని నివేదికలో వెల్లడి అయ్యింది. 
 
అలాగే ఇక నిబంధనల మేరకు అదే ఏడాది నవంబర్‌లో సరోగసి ఒప్పందం ద్వారా తెలిపింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలను పొందారని కమిటీ తేల్చి చెప్పింది.