గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (15:04 IST)

కన్నడ సినిమా ఇండస్ట్రీ బ్యాన్ విధించారా? రష్మిక చెప్పిందేమిటి?

Rashmika Mandanna
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేశారంటూ వస్తున్న పుకార్లపై సౌత్ నటి రష్మిక మందన్న స్పందించింది. ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. తనపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.
 
ఇటీవల విడుదలైన పుష్ప కోసం రష్యాలో ప్రమోషనల్ టూర్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది రష్మిక. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ, తాను కాంతారావు చిత్రాన్ని చూశాను. అద్భుతమైన విజయం సాధించినందుకు టీమ్‌ను అభినందించానని తెలిపింది. 
 
అంతకుముందు కాంతారావు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె దాటవేసింది. ఇంకా  తాను సినిమా చూడలేదని రష్మిక తెలిపింది. 
 
తన వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు ఏమాత్రం అవసరం లేదు. అయితే వృత్తిపరంగా మాత్రం తాను ఏం చేస్తున్నానో ప్రజలకు తెలియజేయడం తన బాధ్యత అంటూ క్లారిటీ ఇచ్చింది రష్మిక. 
 
రష్మిక వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక వారసుడు సినిమాతో పాటు పుష్ప2లో నటిస్తోంది.