ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (18:03 IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రణీత

Pranathi
Pranathi
టాలీవుడ్ నటి, అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ ప్రణీత సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నటి ప్రణీత సుభాష్ నితిన్ రాజ్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ జంటకు ఆడపిల్ల పుట్టింది.
 
ఆ దంపతులు పాపకు అర్నా అని పేరు పెట్టారు. తన కూతురు, భర్తతో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసింది.

నటి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొన్ని చిత్రాలను పంచుకుంది. ప్రణీత తన రెడ్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.