గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (23:28 IST)

సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల మద్దతు..

revanth reddy
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల మద్దతు లభించింది. సీఎం రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించిన తీరు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల సందర్భంగా ఆయన తీరు గొప్పగా వుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.
 
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్రం తొలిగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన శనివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని ప్రకటించారు. 
 
ఎన్నికల మ్యానిఫెస్టో‌లో హామీ ఇచ్చినట్లు బీసీల జనాభా లెక్కలను తేల్చాలని, పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు, బీసీల విద్య, ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అద్భుతం అని, ఇది ప్రజా ప్రభుత్వమని రామకృష్ణ కితాబిచ్చారు.