శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:22 IST)

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్: సమస్యల పరిష్కారం కోసం బారులు తీరిన బాధితులు

Revanth Reddy's Praja Darbar
కర్టెసి-ట్విట్టర్
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచే తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 6 పథకాలలో ఇప్పటికే రెండు పథకాలను పట్టాలు ఎక్కించేసారు. మిగిలినవి కూడా నిర్ణీత గడువు 100 రోజులకు మునుపే అమలుచేయాలని కృతనిశ్చయంతో వున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు.
 
Revanth Reddy's Praja Darbar
రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి వందల సంఖ్యలో బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం బారులు తీరారు. అందరి సమస్యలను పరిష్కారిస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.