ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (21:16 IST)

ఆరు గ్యారంటీలు.. రెండింటిని అమలు చేశాం.. 100 రోజుల్లో... రేవంత్ రెడ్డి

Revanth Reddy
ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం రెండు గ్యారంటీలు మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం, పది లక్షల ఆరోగ్య స్కీమ్‌లను ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ రెండు స్కీమ్‌లకు రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 
 
కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం పురస్కరించుకుని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలల్లో ఈ రోజు రెండింటి అమలు ప్రారంభించినట్లుగా రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ ద్వారా ఆడపిల్లలు, మహిళలందరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
 
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామని, 100రోజుల్లో మిగతా గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు.