ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (12:24 IST)

ఈరోజే మహా ప్రస్థానం లో జమున అంత్యక్రియలు

Jamuna ph
Jamuna ph
ప్రముఖ సీనియర్ నటి జమున మృతికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2గంటలకు ఇంటి దగ్గర నుండి ఫిల్మ్ ఛాంబర్ కు జమున పార్థివ దేహం తరలిస్తారు.  సాయంత్రం 4.30 గంటల వరకూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర  జమున భౌతిక కాయం.  సాయంత్రం 5గంటలకు ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.  జమున మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 
 
అని  సీనియర్ నటీమణి జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆయన అన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తెలుగు వారి స్థాయిని పెంచేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
 
తెలుగు సినిమా సీనియర్‌ నటి జమున మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం సంతాపం తెలిపారు.  ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నటిగానే కాకుండా 1989లో రాజమండ్రి ఎంపీగా ప్రజల మన్ననలు అందుకున్నారని గుర్తుకు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.