ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (12:10 IST)

అతివేగం.. రెండు బస్సుల ఢీ.. ఐదుగురు మృతి

car accident
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున తిరువత్తూర్ జిల్లా, వానియంబాడి హైవేపై రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. 
 
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలియవచ్చింది.