గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (10:44 IST)

పదిమంది చిన్నారుల నరబలి.. 65 మంది మంత్రగాళ్ల అరెస్ట్..

పదిమంది చిన్నారులను అవయవాల కోసం టాంజానియాలో హత్య చేశారు. హత్యకు గురైన చిన్నారుల మృత దేహం నుంచి చెవిని, దంతాలు మాత్రం తీసుకున్నారు. ఇంకా మోకాలి భాగం మాత్రం కనిపించకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 
 
రెండేళ్ల నుంచి పదేళ్ల వయస్సులోపు గల చిన్నారులే ఈ దురాగతానికి బలైపోయారు. ఇదంతా మూఢనమ్మకానికి అనుగుణంగా జరిగిందని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 65 మంది మంత్రగాళ్లను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు పది మంది చిన్నారులు మంత్రగాళ్ల చేతిలో బలైపోయారని పోలీసులు వెల్లడించారు.