సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (10:50 IST)

బ్రిటన్ బ్రిడ్జిపై వ్యానుతో పాదచారులను ఢీకొట్టిన ఉగ్రమూకలు.. ఆరుగురు మృతి

బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయాయి. లండన్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. లండన్‌ బ్రిడ్జిపై పాదచారులను ఉగ్రమూకలు వ్యానుతో ఢీకొట్టారు. బోరోహ్‌ మార్కెట్‌లో ప్రజలపై కత్త

బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయాయి. లండన్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. లండన్‌ బ్రిడ్జిపై పాదచారులను ఉగ్రమూకలు వ్యానుతో ఢీకొట్టారు. బోరోహ్‌ మార్కెట్‌లో ప్రజలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనల్లో ఆరుగురు పౌరులు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
దాడులకు పాల్పడిన ముగ్గురిని భద్రతా బలగాలు హతమార్చాయి. అలాగే లండన్‌ వంతెనను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. క్షతగాత్రులకు ఐదు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న భద్రతాదళాధికారులు తెలిపారు. లండన్ బ్రిడ్జ్ బ్రిటన్‌కు గుండెకాయ వంటిదని అలాంటి ప్రాంతంలో ఐఎస్ ఉగ్రమూకలు దాడులకు పాల్పడటంపై భద్రతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.