Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)
తమిళనాట ఈ మధ్య విశాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు ఆయన నటించిన సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ అన్నట్టుగానే కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. కొన్ని మాత్రం షూటింగ్ మొత్తం పూర్తయినా విడుదలకు మాత్రం నోచుకోవు. అలాంటి సినిమాలలో విశాల్ నటించిన మదగజరాజా ఒకటి.
దాదాపు 12 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అప్పట్లో విశాల్‌కి జోడిగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్లు హీరోయిన్‌లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టామని చెప్పారు.
జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ షాకిచ్చాడు. విశాల్ ఉన్నట్లుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బాగా బక్కచిక్కిపోయిన అతను కనీసం మాట్లాడలేకపోతున్నాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్‌కు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది.