మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (08:55 IST)

ట్రాఫిక్ పోలీస్‌కు న్యూడ్ ఫోటో చూపించి బంపర్ ఆఫర్ ఇచ్చిన మహిళ...

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గతంలో జారీచేసిన అపరాధం రశీదులను రద్దు చేస్తే బంపర్ ఆఫర్ ఇస్తానంటూ ఓ ట్రాఫిక్ పోలీసుకు టెక్సాస్ మహిళ చెప్పింది. పైగా, తన నగ్న ఫోటోలను కూడా చూపించి.. ఇలాంటి ఆఫర్ నేరుగ

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గతంలో జారీచేసిన అపరాధం రశీదులను రద్దు చేస్తే బంపర్ ఆఫర్ ఇస్తానంటూ ఓ ట్రాఫిక్ పోలీసుకు టెక్సాస్ మహిళ చెప్పింది. పైగా, తన నగ్న ఫోటోలను కూడా చూపించి.. ఇలాంటి ఆఫర్ నేరుగా కావాలంటే తనకు జారీ చేసిన ట్రాఫిక్ ఫైన్ చలాన్‌లను రద్దు చేయాలని కోరింది. దీంతో ఖంగుతిన్న ట్రాఫిక్ పోలీస్.. ఆమెపై కేసు పెట్టి.. కోర్టుకు తరలించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అమెరికాలోని టెక్సాస్‌, బేటౌన్‌కు చెందిన 18 యేళ్ళ ఓ మహిళ తన సొంత వాహనాన్ని నడుపుకుంటూ ఇంటికి వస్తోంది. ఆమె ఇంటికి వస్తోన్న మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందరివాహనాల్లాగానే ఆమె వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీల్లో భాగంగా ఆపారు. ఆమె గతంలో రెండుసార్లు ట్రాఫిక్ నిబధనలను ఉల్లఘించిందని పోలీసులకు ఆమెకు రెండు చాలన్లను జారీ చేశారు. ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆమెతో చెప్పారు. 
 
ఆ తర్వాత వాహనాలను తనిఖీ చేస్తున్న మైకేల్ కాప్‌కాక్(33) అనే పోలీసు అధికారి వద్దకు ఆమె నేరుగా వెళ్లి... తనకు జారీ చేసిన చలాన్‌లను వెనక్కి తీసుకుంటే, మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. దానికి శాంపిల్‌గా ఆమె, తన రెండు ఫోటోలను అతడికి చూపించింది. అందులో ఆమె నగ్నంగా ఉండటాన్ని చూసి ఆయన అవాక్కయ్యాడు. వాటిని వెంటనే వెనక్కి తీసుకుంటే ఇప్పుడే ఆ ఆఫర్ ఇస్తానని చెప్పింది. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టులో హజరుపరిచారు.