శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (14:30 IST)

ఒకటి కొంటే మరొకటి ఫ్రీ : 2 వేల డాలర్ల రింగ్ కొనుగోలు చేస్తే రెమింగ్టన్ షాట్‌గన్ ఉచితం

పది గ్రాముల బంగారం కొంటే పది గ్రాముల వెండి ఉచితంగా ఇస్తామన్న ప్రకటనలు చేయడాన్ని మనం చాలానే వినుంటాం. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్ల సీజన్, సెలవుల సమయంలో తమ అమ్మకాలను పెంచుకునేందుకు ముఖ్యంగా కస్టమర్లను ఆకర

పది గ్రాముల బంగారం కొంటే పది గ్రాముల వెండి ఉచితంగా ఇస్తామన్న ప్రకటనలు చేయడాన్ని మనం చాలానే వినుంటాం. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్ల సీజన్, సెలవుల సమయంలో తమ అమ్మకాలను పెంచుకునేందుకు ముఖ్యంగా కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు ఇలాంటి గమ్మత్తు ప్రకటనలు చేస్తుంటారు. 
 
తాజాగా వధూవరులను, దంపతులను ఆకర్షించేందుకు టెక్సాస్‌‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణం వినూత్నంగా ప్రచారం చేస్తోంది. అమెరికాలోని 'థ్యాకర్ జ్యూవెల్లరీ' అనే ఆభరణాల దుకాణం యజమాని 'షాట్ గన్ వెడ్డింగ్ సేల్' పేరిట స్పెషల్ ఆఫర్ అందించారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరిగే అమ్మకాల్లో భాగంగా 2 వేల డాలర్ల విలువైన ఉంగరం కొనుగోలు చేస్తే, రెమింగ్టన్ 870 షాట్ గన్ లేదా బోల్ట్ యాక్షన్ రైఫిల్‌ను ఉచితంగా పొందవచ్చని బంపర్ ఆఫర్‌ను ప్రకటించాడు. 
 
ఈ సందర్భంగా స్టోర్ యజమాని జో థాకర్ మాట్లాడుతూ... తాము ఓ గన్ స్టోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. షాట్‌గన్ వెడ్డింగ్ సేల్‌ను మూడేళ్ళ క్రితం ప్రారంభించామని... వ్యవసాయం, వేటాడటం ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవని చెప్పారు. టెక్సాస్‌కు ఇది సహజంగా అతికినట్లు సరిపోతుందన్నారు. ఇలాంటి వినూత్న ఆఫర్‌ని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదని అన్నారు.