ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:46 IST)

రెండోసారి పాజిటివ్ వచ్చిన వారి నుంచి కరోనా సోకదు

రెండవసారి పాజిటివ్‌ వచ్చినప్పటికి వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవని, వారినుంచి వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కరోనా బారినుంచి కోలుకున్న వ్యక్తులకు మరో సారి పాజిటివ్‌ రావటానికి కారణం వారి శరీరంలోని మృత  వైరస్‌లేనని అన్నారు.

ఇటీవల హాంకాంగ్‌లో 33 ఏళ్ల వ్యక్తికి థెర్మల్‌ స్క్రీనింగ్‌లో కరోనా రెండవ సారి బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో రెండవ సారి కరోనా సోకే విషయంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 'క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డీసీజెస్‌' జర్నల్‌లో ప్రచురించిన నివేదికలో శాస్త్రవేత్తలు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుందని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత యాంటీ బాడీస్‌ సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.

శరీరంనుంచి వైరస్‌లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 'రివర్స్‌ ట్రాన్స్క్రిప్షన్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌' టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్‌ వస్తుందని పేర్కొన్నారు.