శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (08:16 IST)

పింఛన్లు ఇచ్చే వ్యక్తి నుంచి 54 మందికి కరోనా

వనపర్తి జిల్లాలో పింఛన్లు అందజేసిన వ్యక్తి ద్వారా గ్రామంలో 54 మందికి కరోనా సోకింది. చిన్నంబావి మండలం పెద్దదగడలో పింఛన్లు అందజేసే ఓ వ్యక్తి నుంచి కరోనా వ్యాప్తి జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తి పింఛన్లు పంపిణీ చేశాడు. ఆ వ్యక్తి కుటుంబసభ్యుల్లో ఒకరు నాలుగురోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు.

దీంతో కుటుంబసభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కుటుంబంలోని 9 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

గ్రామంలోని 250 మందికి ర్యాపిడ్‌, యాంటిజెన్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.