శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (10:09 IST)

అమెరికాలో కొలంబస్‌ విగ్రహాల కూల్చివేత

అమెరికాలో జాత్యహంకార నిరసనలు కొత్త రూపు దాల్చుతున్నాయి. ఆ నిరసన జ్వాల పక్క తోవలు తొక్కుతోంది. పాఠ్య పుస్తకాల్లో 'కొత్త ప్రపంచం' కనిపెట్టిన వ్యక్తి అని గొప్పగా చెప్పే కొలంబస్‌ను నేటివ్‌ అమెరికన్లు 'మారణ హోమానికి ప్రతీక'గా చూస్తున్న తరుణంలో ఆయన విగ్రహాలను నిరసనకారులు కూల్చివేస్తున్నారు.

కొందరు జాత్యహంకార వ్యతిరేక ఆందోళనకారులు రిచ్‌మండ్‌లోని బైర్డు పార్కు వద్ద ఉన్న క్రిస్టోఫర్‌ కొలంబస్‌ విగ్రహాన్ని మంగళవారం రాత్రి కూల్చి పక్కనే ఉన్న సరస్సులోకి తోసేశారు. రాత్రి 8గంటల సమయంలో బైర్డు పార్కుకు చేరుకున్న నిరసనకారులు ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తాళ్లతో లాగిపడేశారు.

రిచ్‌మండ్‌లో ఈ విగ్రహన్ని 1927 డిసెంబరులో నెలకొల్పారు. విగ్రహాన్ని కూల్చిన చోట మొండి పునాదిపై 'మారణహోమానికి మూలకారకుడు' అని రాశారు. బోస్టన్‌లో నిరసనకారులు కొలంబస్‌ విగ్రహాన్ని శిరచ్ఛేదం గావించారు.

నగరంలోని వాటర్‌ఫ్రంట్‌ పార్క్‌కు సమీపంలో ఉన్న విగ్రహం తలను పూర్తిగా ధ్వంసం చేశారు. మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్‌పౌల్‌లో కూడా ఇదే విధంగా కొలంబస్‌ విగ్రహన్ని ధ్వంసం చేశారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని డౌన్‌టౌన్‌ మియామిలోనూ ఈ నావికుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు