గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (22:21 IST)

'అమెరికాను ఒక జోక్‌లా..': వర్మ సెటైర్‌

'ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాను ఒక జోక్‌లా చూసేలా చేశారు' అని ట్వీట్‌ చేశారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.

నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ.. మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పైనే సెటైర్లు విసిరి వార్తలో నిలిచారు.

ట్రంప్‌పై వర్మ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అమెరికాలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రంప్‌ చేసే వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయంటూ తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.