గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 మే 2020 (09:21 IST)

అమెరికాలో తీవ్ర నిరుద్యోగం

అమెరికాలో తీవ్ర నిరుద్యోగ సమస్య నెలకొంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్‌ నెలలో నిరుద్యోగం రేటు 4.4 శాతం నుంచి 14.7 శాతానికి పెరిగిందని బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(బిఎల్‌ఎస్‌) పేర్కొంది.

అయితే ఇంకా నిరుద్యోగ ప్రయోజనాల కోసం నమోదు చేసుకోని వారి సంఖ్య భారీగా ఉందనే వాదన ఉంది. అధికారికంగా 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అధికారికంగా చెబుతున్నా ఆ సంఖ్య 5 కోట్ల వరకూ ఉంటుందని అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఎఫ్‌ఎల్‌ాసిఐఓ) అధ్యక్షుడు రిచర్డ్‌ త్రుంకా పేర్కొన్నారు.

బిఎల్‌ఎస్‌ కూడా తాము చెబుతున్న గణాంకాలు లెక్కింపు దశలోనే ఉందని చెబుతూ వస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తోంది. వాస్తవ గణాంకాలు, ఆర్థిక రంగానికి చెందని అంశాలు మరింత ఘోరంగా ఉన్నాయి.
 
ఒక నెలల్లో నిరుద్యోగుల సంఖ్య 71.4 లక్షల నుంచి 2 కోట్ల 30 లక్షల మందికి చేరిందని బిఎల్‌ఎస్‌ పేర్కొంది. ఈ 1.59 కోట్ల మంది నిరుద్యోగుల పెరుగుదల ఏప్రిల్‌ నెల చివరి వారం నాటికి నిరుద్యోగ బీమా కోసం దరఖాస్తు చేసుకున్న 3.16 కోట్ల మందిని లెక్కించలేదు.

ఉద్యోగాల కోసం ఎదురుచూసి నిరుత్సాహ పడిన వారిని, పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసే వారిని కూడా ఇది లెక్కలోకి తీసుకోలేదు. తద్వారా 22.8 శాతం నిరుద్యోగం ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు వచ్చిన జీతభత్యాలపై ఆధారపడి జీవిస్తున్న ఫ్లోరిడా, ఫిలడెల్ఫియోల్లో నిరుద్యోగులను ఉటంకిస్తూ ఈ సంఖ్యల వెనుక నిజమైన వ్యక్తులు ఉన్నారని త్రుంకా పేర్కొన్నారు.

వారు ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఆరోగ్య బీమా కూడా కోల్పోయారని చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మంది ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ప్రయోజనాల కోసం నమోదు చేయించుకోలేకపోయారని తెలిపారు.