గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (10:55 IST)

కంటి వైద్యం.. వృద్దురాలిపై దురుసుగా ప్రవర్తించిన వైద్యుడు

doctor
కంటి వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలి పట్ల వైద్యుడు దురుసుగా ప్రవర్తించాడు. ఓ వృద్ధురాలి కంటికి చికిత్స చేస్తుండగా ఆమెను కొట్టాడు. ఈ సంఘటన 2019 లో చైనాలోని గైగాంగ్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే... 82 ఏళ్ల మహిళ కంటి చికిత్స కోసం వుహాన్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. కానీ చికిత్స ప్రారంభించే ముందు ఆమెకు అనస్థీషియా ఇచ్చారు. కానీ అనస్థీషియా ఆమెపై పెద్దగా ప్రభావం చూపలేదు. శస్త్రచికిత్స కొనసాగుతుండగా, ఆమె తల, కనురెప్పలు కదిలాయి. డాక్టర్ కోపంతో ఆమె తలపై కొట్టాడు. చికిత్సకు సహకరించాలని గట్టిగా అరిచాడు.
 
ఓ మహిళపై వైద్యుడు దాడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పాడు. ఆమెకు పరిహారంగా రూ. 5,800 చెల్లించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. వృద్ధురాలిపై దాడి చేసిన వైద్యుడిని సస్పెండ్ చేశారు.