ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (18:54 IST)

మహిళ కంట్లో 60 కీటకాలు.. ఎలా వచ్చాయంటే?

ఇంద్రియాల్లో అత్యంత సున్నితమైనవి కళ్ళు అని చెప్పవచ్చు. అలాంటి కంటిలో నలుసు పడితేనే తట్టుకోలేం. కానీ ఓ మహిళ కంట్లో కీటకాలను వైద్యులు కనుగొన్నారు. కళ్లలో దురద వస్తోందని ఒక మహిళ డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు.. ఆమె కళ్లను పరిశీలించిన వైద్యులకు ఆమె కనురెప్పలు  కను గుడ్ల మధ్య కీటకాలు పాకుతున్నట్లు కనుగొన్నారు. 
 
చైనాలోని కున్‌మింగ్‌లో వెలుగులోకి వచ్చింది. పరిస్థితి చేయి దాటిందని అర్థం చేసుకున్న డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేశారు. వాటిని ఆపరేషన్ చేసి తీస్తున్నప్పుడు వాటి సంఖ్య 60 కంటే ఎక్కువగా ఉంది. ఆ కీటకాలు సాధారణంగా ఈగ ద్వారా వ్యాపించాయని తెలుస్తోంది. జంతువులతో ఆడుకున్న తర్వాత అదే చేతులతో తన కళ్లను రుద్దుకోవడం వల్లే తనకు ఈ సమస్య వచ్చిందని ఆ మహిళ వైద్యులకు చెప్పింది.