ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:07 IST)

వెనీస్‌ను ముంచెత్తిన సముద్ర నీరు

నీటిపై తేలియాడే నగరంగా పేరుగాంచిన ఫ్రాన్స్లోని వెనీస్‌ నగరం...మోకాళ్ల లోతు నీటితో నిండిపోయింది. అక్కడ సముద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ కృత్రిమ ఆనకట్ట వ్యవస్థ ఫెయిల్‌ అవ్వడంతో ఈ దురావస్థ ఏర్పడింది.

నీటి మట్టం 1.37 మీటర్లు...4.5 అడుగులకు చేరడంతో ఈ వ్యవస్థ దెబ్బతిని..సముద్ర మట్టానికి కేవలం ఒక మీటరు ఎత్తులో ఉన్న వెనీస్‌ నగరంలోని సెయింట్‌ మార్క్స్‌ స్వ్కేర్‌ జల దిగ్భంధంలో కూరుకుపోయింది. దీంతో ఆక్కడి దుకాణాదారుల పరిస్థితి దుర్భరంగా మారింది.

షాపుల్లోకి నీరు చేరకుండా అడ్డుగా చెక్కలను అమర్చేందుకు అవస్థలు పడ్డారు. సముద్రం అటుపోట్లు సమయంలో వరద ఉధృతిని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థను ఈ ఏడాది అక్టోబర్‌లో అమర్చారు. కాగా, మంగళవారం సముద్ర మట్టాని కన్నా అధిక నీరు రావడంతో అంచనాలు తల్లకిందులై.. ఒక్కసారిగా ఈ వ్యవస్థ కుప్పకూలింది.

కాగా, దీనిపై మరింత సమీక్ష చేపడతామని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్‌ 12న సముద్ర నీటి మట్టం 1.87 అడుగులు అనగా ఆరు అడుగుల మేర పెరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో యునెస్కో వారసత్వ సంపదగా చెబుతున్న పలు చర్చిలు ధ్వంసమయ్యాయి.