1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (17:34 IST)

సముద్రపు ఒడ్డుకు నరికేసిన కాళ్లు... ఓ వింతగా మారిన మిస్టరీ!

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా - అమెరికాలోని వాషింగ్టన్‌ల మధ్య సలిష్ సముద్ర తీరం ఉంది. ఈ సముద్రపు ఒడ్డుకు నరికేసిన కాళ్లు కొట్టుకొస్తున్నాయి. ఈ తంతు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ మిస్టరీని స్థానిక పోలీసులు ఇప్పటివరకు ఛేదించలేకపోయారు. ఇంతకీ సముద్రపు ఒడ్డుకు నరికేసిన కాళ్లు ఎలా కొట్టుకొస్తున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. 
 
సలిష్ సముద్రంలో తొలి ఘటన 1887లో చోటుచేసుకుంది. తర్వాత 1914లో మరో పాదం కూడా అలాగే దొరికింది. ఆ తర్వాత అటువంటి ఘటనలేవీ జరగలేదు. కానీ 2007 నుంచి మనుషుల కాళ్లు.. పాదాలు కొట్టుకురావటం షరా మామూలుగా మారిపోయింది. 
 
2018 జనవరి 1న జెట్టీ ఐల్యాండ్‌ తీరానికి ఓ షూతో పాటు మనిషి పాదం కొట్టుకొచ్చింది. దాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. 2016, డిసెంబరు 12 నుంచి ఆచూకీలేని ఆంటోనియో నిల్‌ అనే వ్యక్తిదని తెల్చారు. సలిష్ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలకు ఆ కాళ్లు కొట్టుకొస్తున్నాయి. ఇలా ఇప్పటివరకూ 21 కాళ్లు కొట్టుకొచ్చాయి.
 
అసలు సముద్రతీర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియక... స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితాలను వెళ్లదీస్తున్నారు. పోలీసులు ఆ తీర ప్రాంతాలపై నిఘా పెట్టిన ఫలితం లేదు. దీనికి సంబంధించిన బాధితుల ఆచూకీ కూడా అంతుచిక్కడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీచ్‌లకు చేరుకుంటున్న అన్ని కాళ్లకు షూలు గమనార్హం.
 
దీనిపై కెనడా పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత వివరణ ఇచ్చారు. సలిష్ సముద్రంలో ఆత్మహత్య చేసుకునేవారు.. వివిధ ప్రమాదాల్లో మరణించేవారి పాదాలు తీరానికి కొట్టుకొస్తున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ, శరీరాలు కాకుండా కేవలం పాదాలు.. కాళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకొస్తున్నాయనే విషయానికి మాత్రం వారి వద్ద సమాధానం లేదు.