శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (09:42 IST)

వాణిజ్య పోరు.. డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురు.. మెక్సికోకు అనుకూలంగా ఆదేశాలు

అమెరికాపై 163 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య ఆంక్షలను విధించేందుకు అనుమతిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్త (డబ్ల్యూటీఓ) మెక్సికోకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో మెక్సికోతో జరుగుతున్న వాణిజ్య పోరులో ట్రంప్‌

అమెరికాపై 163 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య ఆంక్షలను విధించేందుకు అనుమతిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మెక్సికోకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో మెక్సికోతో జరుగుతున్న వాణిజ్య పోరులో ట్రంప్‌ ప్రభుత్వం పరాజయం పాలైనట్లైంది. అమెరికా, మెక్సికో, కెనడాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తిరిగి చర్చించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలోనే ఈ ఆదేశాలు వచ్చాయి. 
 
మెక్సికన్ టునా చేపలపై అమెరికా అక్రమంగా విధించిన ఆంక్షల కారణంతో మెక్సికో పెద్ద మొత్తంలో నష్టపోయిందని డబ్ల్యూటీఓ పేర్కొంది. టునా చేపలు పట్టడం కోసం డాల్ఫిన్లను చంపరాదని, అలా వాటిని చంపి పట్టే టునా చేపలను అమెరికా మార్కెట్లో విక్రయించరాదని అమెరికా పట్టుబడుతోంది. 
 
తమ జాలర్లు నిబంధనలకు కట్టుబడే వ్యవహరిస్తున్నారని మెక్సికో ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ అమెరికా ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఈ వివాదం డబ్ల్యుటిఓ దృష్టికి వెళ్లడంతో అమెరికా వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మెక్సికోకు అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి.