మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (10:54 IST)

సాల్మన్ చేప ముళ్లుతో డ్రెస్... ఎలా ఉందో తెలుసా?

సాధారణంగా ఫ్యాషన్‌ షోలలో వివిధ రకాల డిజైన్లతో తయారైన దుస్తులను ధరించి క్యాట్ వాక్ చేస్తూ ఆహుతులను ఆకట్టుకుంటారు. కానీ, ఆ యువతి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. తన మదిలో కొత్త ఆలోచన వచ్చిందే తడవుగా ద

సాధారణంగా ఫ్యాషన్‌ షోలలో వివిధ రకాల డిజైన్లతో తయారైన దుస్తులను ధరించి క్యాట్ వాక్ చేస్తూ ఆహుతులను ఆకట్టుకుంటారు. కానీ, ఆ యువతి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. తన మదిలో కొత్త ఆలోచన వచ్చిందే తడవుగా దాన్ని అమలు చేసింది. సాల్మన్ చేపల ముళ్లు(అస్థిపంజరాలు)తో ఓ డ్రెస్‌ను తయారు చేసింది. ఈ డ్రెస్ వేసుకుని ఆమె క్యాట్ వాక్ చేయకపోయినా... చూపరుల మన్నలు మాత్రం పొందింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అలస్కా అనే ప్రాంతానికి చెందిన స్నేన్ గిబ్సన్ అనే 23 యేళ్ల యువతి అందరిలాగా క్యాట్ వాక్ చేయాలని భావించింది. అయితే, తాను ధరించే దుస్తులు ప్రత్యేకంగా తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 20,000 సాల్మన్ చేపల అస్థిపంజరాలను సేకరించింది. వాటితో డ్రెస్ తయారు చేసింది. అది వేసుకుని స్టీకా వీధుల్లో ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది నిశ్చేష్టులైపోయారు. 
 
ముందు ఆమె ఏ ఫ్యాషన్‌షోలో క్యాట్ వాక్ చేయకపోయిన, తన తొలి ఓపెన్‌షో ద్వారానే అందరి మన్నలను పొందింది. ఆ డ్రెస్ తయారు చేసేందుకు ఆరు నెలలపాటు కష్టపడానని ఆమె తెలిపింది. సాల్మన్ చేపల ఆస్థిపంజరాలను సేకరించి వాటిని ఎండబెట్టి తర్వాత బ్లీచింగ్ చేసింది. దీంతో ముళ్లు గట్టిపడ్డాయి. ఆ తర్వాతే డ్రెస్ రూపంలో అది దర్శనమిచ్చిందని ఆమె తెలిపింది.