శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 జులై 2017 (14:19 IST)

చర్చి ఫాదర్‌పై ముగ్గురు మహిళల అత్యాచారం: కట్టేసి.. కండోమ్ తగిలించి.. ఆ పని చేశారు!

చర్చి ఫాదర్‌పై ముగ్గురు యువతులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇచ్చిన రుణాన్ని అడిగేందుకు వెళ్ళిన పాపానికి అతనిని తాడులతో కట్టేసి.. ముగ్గురు మహిళలు చర్చి ఫాదర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఘటన జింబాబ్వేలో చో

చర్చి ఫాదర్‌పై ముగ్గురు యువతులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇచ్చిన రుణాన్ని అడిగేందుకు వెళ్ళిన పాపానికి అతనిని తాడులతో కట్టేసి.. ముగ్గురు మహిళలు చర్చి ఫాదర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఘటన జింబాబ్వేలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేలోని బులవాయో నగరంలోని ఓ క్రైస్తవ దేవాలయంలో పనిచేస్తున్న ఫాదర్ వద్ద ముగ్గురు యువతులు రుణం తీసుకున్నారు. అయితే తీసుకున్న రుణం ఇవ్వకపోవడంతో.. రుణంగా ఇచ్చిన డబ్బును తీసుకునేందుకు ముగ్గురు యువతులు నివసిస్తున్న ఇంటి వద్దకు ఫాదర్ వెళ్లాడు. 
 
ఆ సమయంలో ఫాదర్‌ను ఆ యువతులు ఇంట్లోకి రమ్మని పిలిచారు. ఫాదర్ కూడా రుణం తిరిగి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో లోనికి వెళ్లాడు. అంతే ముగ్గురు యువతులు ఫాదర్‌ను గట్టిగా కట్టేశారు. ఆపై ఆయన్ని వివస్త్రను చేశారు. కండోమ్ తగిలించారు. చివరికి ముగ్గురు యువతులు ఆయనపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతుల నుంచి తప్పించుకునేందుకు ఎంత పోరాడినా ప్రయోజనం లేకపోయింది. 
 
దీనిపై ఫాదర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువతులు అరెస్టయ్యారు. చేసిన తప్పును ఓ యువతి అంగీకరించగా, మరో ఇద్దరు యువతులు ఈ అఘాయిత్యానికి ఫాదర్‌ కూడా సహకరించాడని ఆరోపణలు చేశారు. కానీ ఈ ఆరోపణలను ఫాదర్ తీవ్రంగా ఖండించాడు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.