శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:48 IST)

జూలో ఎంట్రన్స్ ఫీజు తగ్గుతుందని.. ఫెన్సింగ్ ఎక్కి దూకాడు.. పులి చంపేసింది..

ఎంట్రన్స్ ఫీజు నుంచి తప్పించుకుందామని ఫెన్సింగ్ దాటి జా పార్కులోకి వెళ్లిన ఓ మనిషిపై పులి దాడి చేసి చంపేసింది. అతని భార్య, కొడుకు చూస్తుండగానే దారుణం జరిగింది. చైనాలోని జింయాంగ్ జింగ్ ప్రావిన్స్‌లోని

ఎంట్రన్స్ ఫీజు నుంచి తప్పించుకుందామని ఫెన్సింగ్ దాటి జా పార్కులోకి వెళ్లిన ఓ మనిషిపై పులి దాడి చేసి చంపేసింది. అతని భార్య, కొడుకు చూస్తుండగానే దారుణం జరిగింది. చైనాలోని జింయాంగ్ జింగ్ ప్రావిన్స్‌లోని యంగ్ నర్ జాతీయ పార్క్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. డాంగియన్ లేక్ పార్క్‌లో ఫ్యామిలీతో కలిసి జూపార్క్ సందర్శనకు వెళ్లాడు చైనాకు చెందిన జాంగ్. ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రన్స్ ఫీ కట్టి.. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. జాంగ్.. అతని ఫ్రెండ్ ఎంట్రన్స్ టికెట్స్ లేకుండా లోపలికి వెళ్దామని ఫెన్సింగ్ ఎక్కి పార్క్‌లోకి దూకేశారు. వాళ్లు ఫెన్సింగ్ దాటిన చోటే టైగర్ జోన్ ఉండటంతో ప్రమాదం తప్పలేదు. 
 
ఇలా టైగర్‌లో చిక్కుకున్న జాంగ్‌పై పులి వేట జరుగుతుంటే జూలోని సందర్శకులు కళ్లారా చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు చూసిన వాళ్లు. జాంగ్‌‍పై దాడి చేసిన పులిని పోలీసులు కాల్చేశారు. టైగర్ అటాక్ సమయంలో అతని స్నేహితుడు దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. పోలీసులు అతన్ని రక్షించారు.