శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (15:49 IST)

ముస్లింలపై మాట మార్చను.. నేను చెప్పింది వందశాతం కరెక్ట్: డొనాల్డ్ ట్రంప్

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ముస్లింలపై తన మాటను మార్చనంటున్నారు. అమెరికాకు వలస వచ్చే ముస్లింలపై నిషేధం విధించాలన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని, అదే కరెక్ట్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ముస్లింలపై తన మాటను మార్చనంటున్నారు. అమెరికాకు వలస వచ్చే ముస్లింలపై నిషేధం విధించాలన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని, అదే కరెక్ట్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. బెర్లిన్, అంకారాల్లో జరిగిన దాడులు మానవత్వంపై జరిగిన దాడులని.. వీటిని వెంటనే ఆపేయాలని ట్రంప్ అన్నారు. 
 
ముస్లింల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయనే దాన్ని నిరూపిస్తానని, తాను చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్‌ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు వచ్చే ముస్లింలపై నిషేధం విధించాలన్నారు. బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్‌పై టెర్రరిస్టులు దాడికి పాల్పడి 12 మందిని హతమార్చిన నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ముస్లింలపై నోరు విప్పారు. 
 
కాగా ఈ దాడి తమ సంస్థకు చెందిన సైనికుడే చేశాడంటూ ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఘటనకు ముందు టర్కీ రాజధాని అంకారాలో ఓ ఆర్ట్‌ గ్యాలరీ తిలకించేందుకు వచ్చిన రష్యా రాయబారిపై కాల్పులు జరిపి హతమార్చారు. దీనిపై ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. ఐసిస్‌, ఇతర ఇస్లామిక్‌ తీవ్రవాదులు వరసగా క్రైస్తవ సమాజాన్ని, వారి ప్రార్థనాలయాల్ని లక్ష్యంగా చేసుకుని వూచకోతకు పాల్పడుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.