1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (11:55 IST)

మగాళ్లు ఆ విషయంలో మరీ వీక్ అట.. అవి లేకుంటే అస్సలుండలేరట!

తాజాగా జర్మనీలోని వుర్జ్ బర్గ్ వర్శిటీ బ్రిటన్‌లోని నొట్టింగమ్.. ట్రెంట్ వర్శిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన సర్వేలో.. మగాళ్లు మొబైల్ ఫోన్లు అదీ స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేరట. ఈ విషయంలో మగాళ్లు

మగాళ్లు ఆ విషయంలో మరీ వీక్ అని తాజా సర్వేలో తేలింది. ఆ విషయం అంటే ఏంటి అనేగా మీ డౌట్ అయితే చదవండి మరి. తాజాగా జర్మనీలోని వుర్జ్ బర్గ్ వర్శిటీ బ్రిటన్‌లోని నొట్టింగమ్.. ట్రెంట్ వర్శిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన సర్వేలో.. మగాళ్లు మొబైల్ ఫోన్లు అదీ స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేరట. ఈ విషయంలో మగాళ్లు మరీ వీక్‌గా ఉన్నట్టుగా తేల్చారు. 
 
డిజిటల్ ప్రపంచంలో శరీరంలో భాగంగా మారిన మొబైల్ లేనిదే మగాళ్లకు అస్సలు నిద్రపట్టట్లేదట. అంతేగాకుండా మగాళ్లను స్మార్ట్ ఫోన్లు నీడలా వెంటాడుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్లకు మగాళ్లు మహా అయితే 21 సెకన్లు దూరంగా ఉండగలుగుతున్నారట. అదే ఆడాళ్లు మాత్రం 57 సెకన్ల పాటు మొబైల్ ఫోన్లే లేకున్నా ఓకే అంటున్నారట. 
 
స్మార్ట్ ఫోన్లు ఎంత ఎక్కువగా వినియోగిస్తే అంత ఒత్తిడికి గురవుతున్నారనే విషయం కూడా ఈ పరిశోధనలో తేలింది. స్మార్ట్ ఫోన్ లేకుంటే ఏదో కోల్పోయినట్లుగా మగాళ్లున్నారని.. ఎప్పుడూ చాంటింగ్, సోషల్ మీడియాల ప్రాభవంతో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయిందని సర్వే తేల్చింది.