బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:34 IST)

గాయపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ

zelenskeyy
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రాజధాని కీవ్‌ నగరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న కారును, పక్కనున్న కాన్వాయ్‌ను ఢీ కొట్టి బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే ఆంబులెన్స్‌తో అధికారులు అక్కడికి చేరుకున్నారు. 
 
జెలెన్‌స్కీని, ఆయన కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో జెలెన్‌స్కీకి, డ్రైవర్‌కు తీవ్రగాయాలేవీ కాలేదని ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి.
 
తీవ్రంగా గాయపడనప్పటికీ.. జెలెన్‌స్కీ ఆరోగ్యంపై అధ్యక్ష కార్యాలయం పూర్తిస్థాయి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాల్సి ఉంది. ఇది యాక్సిడెంటేనా? లేదంటే కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉందని ఉక్రెయిన్‌ అధికార ప్రతినిధి సెర్గీ నికిఫోరోవ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. 
 
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఖార్కీవ్‌ ప్రాంతంలో రష్యా బలగాలు వెనక్కి మళ్లాయంటూ జెలెన్‌స్కీ బుధవారం రాత్రి ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ వీడియో చేసిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది.