ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (17:17 IST)

రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం

Cyrus Mistry
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అమిత వేగంగా వస్తున్న కారు చరోటీ వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. అక్కడే ప్రాణాలు విడిచారు. డ్రైవర్‌కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 
 
ఈ ఘటన పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు‌ డ్రైవర్‌కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.