శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (13:16 IST)

భారతీయ గర్భిణీ పర్యాటకురాలు మృతి - నైతిక బాధ్యతతో మంత్రి పదవికి రాజీనామా

Pregnant woman
రాజకీయ నేతల్లో అతి తక్కువు మంది మాత్రమే నైతిక విలువలకు కట్టుబడివుంటారు. అంతరాత్మ ప్రభోదం మేరకు నడుచుకుంటారు. విధులు నిర్వహిస్తుంటారు. అయితే, పోర్చుగల్ దేశంలో గర్భంతో ఉన్న భారతీయ పర్యాటకురాలు విపత్కర పరిస్థితుల్లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ పర్యాటక మంత్రి ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 
 
ఆ మంత్రి పేరు మార్టా టెమిడో. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, లిస్టన్‌లోని ప్రధాన ఆస్పత్రి శాంటియా మారియాలో నియోనాటాలజీ విభాగం కరోనా సమయంలో కిక్కిరిసిపోయింది. దీంతో 34 యేళ్ళ భారతీయ గర్భిణీని ఆస్పత్రిలో చేర్చేందుకు అంబులెన్స్‌లో పలు చోట్ల తిప్పారు. 
 
ఆ సమయంలో ఆస్పత్రులన్ని కిక్కిరిసోపియి ఉండటంతో ఆమెను చేర్చేందుకు ఒక్కటంటే ఒక్క పడక కూడా లభించలేదు. ఈ క్రమంలో ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. ఆమె మరణించారన్న వార్త తెలుసుకున్న మంత్రి టెమిడో తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. 
 
 
 
మరోవైపు, ఈ పర్యాటకురాలి మృతిపై పోర్చుగల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో కరోనా సమయంలో ఆస్పత్రులోని ప్రసూతి విభాగాలు కూడా పూర్తిగా నిండిపోవడంతో గర్భిణిలు కూడా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. 
 
ఈ కారణంగానే భారతీయ పర్యాటకురాలిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో మరణించిందని తేలింది. 
 
దీనిపై విపక్ష పార్టీలు ఆరోగ్య మంత్రిపై దుమ్మెత్తి పోశారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
కరోనా సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసూతి సేవలను నిలిపివేయాలని ఆదేశించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆరోగ్య మంత్రిపై విపక్ష పార్టీల నేతలు దుమ్మెత్తి పోశారు. దీంతో మంత్రి టెమిడో గర్భిణి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.